చెత్త ట్రాలీలో తల్లి మృతదేహం.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కడలూరులో కరోనాతో ఓ మహిళ మృతిచెందింది. దీంతో అంబులెన్స్ కోసం వేచి చూశారు. ఇలా 12 గంటలపాటు అంబులెన్స్ కోసం పడిగాపులు కాచాడు మృతురాలి కొడుకు. కానీ, అయినా కూడా అంబులెన్స్ రాలేదు. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. అనాథ శవంలా పడి ఉన్న తన తల్లి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం ఆ తల్లి మృతదేహాన్ని తానే చెత్త ట్రాలీలో తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement