- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగుల పీఎఫ్ జమ చేయకుండా మోసం
దిశ, క్రైమ్ బ్యూరో: ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన పీఎఫ్, టీడీఎస్ మొత్తాలను ఆ అకౌంట్‌లలో జమచేయకుండా మోసానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ కంపెనీ డైరెక్టర్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పర్వేసియో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి సంజయ్ కనోడియా(52), సీమా కనోడియా (48), బీంరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి(40)లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి కంపెనీలో సుమారు 61 మంది ఉద్యోగుల పీఎఫ్, టీడీఎస్ డబ్బులను ఇవ్వకుండా, దాదాపు రూ.1 కోటి రూపాయల మోసం చేశారు. దీంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ సీపీ అవినాష్ మహాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసును దర్యాప్తులో కీలకంగా పనిచేసిన వైట్ కాలర్ అఫెన్ సెస్ టీమ్ ఎస్ఐ కె.రామకృష్ణ, ఇన్ స్పెక్టర్ గోవిందరెడ్డిలను జాయింట్ సీపీ అవినాష్ మహాంతి అభినందించారు.
మంత్రి పువ్వాడ అజయ్ పీఎస్‌కు వేధింపులు
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్సనల్ సెక్రటరీ కిరణ్ కుమార్ వేధింపులకు గురవుతున్నట్టు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. గత గత కొద్ది రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న పీఎస్ కిరణ్ కుమార్ ఓ గుర్తు తెలియని తరుచూ ఫోన్ చేసి వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతకరమైన భాషలో మెస్సేజ్‌లు పెడుతున్నట్టు తెలిసింది. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.