- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి ప్యాంట్‌లో ఏడు గంటలున్న నాగుపాము
దిశ, వెబ్‌డెస్క్: మన దుస్తుల మీద చిన్న పురుగు వాలితేనే వెంటనే ఆ వస్త్రాలను తీసివేస్తాం.. అదే పాము ముందుకు వస్తే ఆగకుండా పరిగెడతాం. అదే నాగుపాము మన దుస్తుల్లో దూరితే.. ఇక చావును పక్కనబెట్టుకున్నట్లే. కానీ, నాగుపామును తన ప్యాంట్‌లో ఏడు గంటలు కదలకుండా పెట్టుకున్న యువకుడు బతికి బయటపడ్డాడు. యూపీలో జరిగిన ఈ ఘటన బాధిత యువకుడికి ప్రాణాలను ప్యాంట్‌లో పెట్టుకున్నంత పనైంది.
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పరిధి ఓ గ్రామంలో విద్యుత్ కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. కొత్తగా విద్యుత్ స్తంభాలు, తీగల ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. కొద్ది రోజుల పాటు పనులు సాగుతుండడంతో.. కార్మికులు స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోనే బస చేస్తున్నారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఓ నాగు పాము.. అంగన్ వాడీ కేంద్రంలోకి రావడమే కాకుండా.. నేరుగా ఓ కార్మికుడు ధరించిన ప్యాంట్‌లోకి దూరింది. దీంతో ఒక్కసారి మెలుకువ వచ్చిన కార్మికుడు ప్యాంట్‌లో పాము దూరిందని గ్రహించాడు. ఇక అతడి పరిస్థితి వర్ణనాతీతం.
ఈ సమయంలో కూడా ఆ కార్మికుడు కొద్దిగా సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. కదిలితే ఎక్కడ కాటేస్తుందోనన్న భయంతో పక్కనే ఉన్న ఓ స్తంభాన్ని పట్టుకుని నిలుచున్నాడు. అర్ధరాత్రి పైగా గ్రామంలో జన సంచారం లేదు. బిక్కు బిక్కు మంటూ.. ప్రాణాలను ప్యాంట్‌లోనే పెట్టుకొని.. ఏకంగా 7 గంటలు కదలకుండా నిలబడ్డాడు. ఇక ఉదయాన్నే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ఒడుపుతో పామును బయటకు తీశాడు. దీంతో కార్మికుడితో పాటు గ్రామస్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముట్టుకుంటేనే కాటు వేసే నాగుపాము.. ఏకంగా 7 గంటలు అతడి ప్యాంట్‌లోనే ఉండి కాటేయకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఏది ఏమైనా పాము-ప్యాంట్ కథ చివరకు సుఖాంతం కావడం గమనార్హం.