- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఉద్యమాన్ని విరమించం.. ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక
దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగ సంఘాల సమస్యలను నెరవేర్చేందుకు ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌తో పాటు ఇతర డిమాండ్లపై సీఎం వైఎస్ జగన్ గురువారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఉద్యోగులకు 34 శాతం పీఆర్సీ ప్రకటిస్తే ఎలా ఉంటుందో అన్నదానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు తీపికబురు చెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తాము కేవలం పీఆర్సీ కోసమే పోరాడటం లేదని 71 న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నట్లు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
సీపీఎస్ రద్దు బాధ్యత కూడా సీఎం జగన్ బాధ్యతేనని చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ సంఘాలు ఇప్పటికే 71 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయని చెప్పుకొచ్చారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలని, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచడం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీతో పాటు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లను సైతం పరిష్కరించాల్సిందేనని, లేని పక్షంలో ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని తెలిపారు.
కేవలం పీఆర్సీ ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని చెప్పుకొచ్చారు. పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని ఆపేది లేదని తెగేసి చెప్పేశారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఓపిక పట్టామని.. ఇక ఓపిక పట్టలేమన్నారు. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రెండో విడత ఉద్యమ కార్యచరణను సైతం త్వరలోనే ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులు స్పష్టం చేశారు.
- Tags
- CPS