రెండో రోజు ప్రశాంతంగా బంద్

by Shyam |   ( Updated:2021-08-11 03:49:30.0  )
రెండో రోజు ప్రశాంతంగా బంద్
X

దిశ, పరకాల: పరకాల అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపు రెండో రోజు కొనసాగుతోంది. రెండు రోజులుగా సాగుతున్న ఈ బంద్.. వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకడంతో బంద్ సంపూర్ణంగా అమలు జరుగుతోంది. బంద్ సందర్భంగా అఖిలపక్ష నేతలు పరకాల పట్టణంలో కాకతీయ ఆటో యూనియన్ సంఘీభావంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి సైతం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మూలంగా ప్రాధాన్యతను కోల్పోతుందన్నారు. అర్బన్, రూరల్ జిల్లాల గెజిట్ విషయంలో అభ్యంతరాల గడువు సమీపిస్తున్నా ఎమ్మెల్యే నోరు మెదపకపోవడం పరకాల ప్రజల్ని విస్మయానికి గురి చేస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పథకాలను బలిపీఠంపై పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నోరువిప్పి పరకాల జిల్లా ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పోరాటాలను మరింత ఉధృతంగా సాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి, కో-కన్వీనర్ లు మార్త బిక్షపతి, దుబాసి వెంకటస్వామి, బిజెపి నాయకులు జయంత్ లాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మేఘ నాదం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed