- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవినీతి సొమ్ము కాదు.. సొంత డబ్బులిచ్చాం
దిశ, పటాన్‌చెరు: పంచాయితీ సభ్యులకు ఇచ్చింది అవినీతి సొమ్ము కాదని, పండుగ ఖర్చుల కోసం సొంత డబ్బులు ఇచ్చామని అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట సర్పంచ్ ఏర్పుల కృష్ణ, ఉప సర్పంచ్ ఎండీ ఫహీం స్పష్టం చేశారు. గురువారం కిష్టారెడ్డిపేటలో వారు వేరు వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ ఏర్పుల కృష్ణ, ఉప సర్పంచ్ ఫహీం మాట్లాడుతూ… బిల్డర్ల వద్ద వసూలు చేసి వాటాలు పంచుకున్నామని రెండో వార్డు సభ్యుడు దొంతి అశోక్ ముదిరాజ్ చేసిన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్న విషయం తమకు తెలుసని, అవినీతి సొమ్మును ఎవరైనా బహిర్గతంగా పంచుకుంటారా? అని ప్రశ్నించారు. హోలీ పండుగ సందర్భంగా సభ్యులు ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
వైరల్ అయిన వీడియో పాతదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులతో పాటు తమపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంతి అశోక్ కూడా డబ్బులు తీసుకున్నాడని గుర్తుచేశారు. పంచాయతీలో కారోబార్‌గా పనిచేసిన నాగరాజును తాము తొలగించామని, ఆ అక్కసుతో వార్డు సభ్యుడు దొంతి అశోక్ ముదిరాజ్‌తో కుమ్మక్కై పంచాయతీలోని పాత సీసీ ఫుటేజ్ దొంగలించి వార్డు సభ్యుడు అశోక్‌కు ఇచ్చినట్టు చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆ డబ్బులు బిల్డర్ల వద్ద వసూలు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్, సత్యనారాయణ, మాజీ సర్పంచ్ దొంతి రాములు ముదిరాజ్, వార్డు సభ్యులు శ్రీకాంత్, సంతోష, విజయ, టీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.