- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి కార్యదర్శిని తప్పించండి.. ఎంపీడీఓకు ఫిర్యాదు
దిశ, ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామ కారదర్శి సాయికృష్ణ పంచాయతీ నిధులు దుర్వియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ గ్రామ సర్పంచ్ ఆర్.ప్రమీల సోమవారం ఎంపీడీఓకు ఫిర్యాదుకు చేసింది. గ్రామంలో ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేస్తూ, తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడని, పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. అంతేగాకుండా.. నూతనంగా నిర్మించే ఇండ్లకు అనుమతి ఇచ్చే విషయంతో పాటు గ్రామ పంచాయతీ నుండి జారీచేసే సర్టిఫికెట్లకు కూడా ప్రజల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ నోట్‌ను సొంతానికి వాడుకుంటున్నాడని ఆరోపించింది. అనేక విషయాల్లో సర్పంచ్, పాలకవర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిధులను సొంతానికి వాడుకుంటూ, లెక్కలు రాయకుండా సొమ్ము చేసుకుంటున్నడని ఫిర్యాదులో పేర్కొంది. అవినీతికి పాల్పడుతున్న కార్యదర్శిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు.