వాళ్లకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు

by Ramesh Goud |
Minister Talsani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జుసాగర్ ప్రజలు కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఓటు వేశారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సాగర్ ఎన్నికల్లో గెలుపొందినందుకు సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సాగర్ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షాలకు ప్రజలకు కర్రకాల్చి వాతపెట్టారని తెలిపారు. ఎన్నికలకు మందు నోముల నర్సయ్యపై అభిమానంతో జానారెడ్డిని పోటీ చేయవద్దని కోరినప్పటికీ పట్టించుకోకుండా నామినేషన్ వేసారని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టుగా అగౌరవంగా మాట్లాడారని తెలిపారు. వీటన్నింటని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం క‌ృషి చేసిన వారికి ఓటు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నాగార్జున సాగర్ నియోజకర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేపడుతామని హామీ ఇచ్చారు.

దేశంలో ఎన్నికలు జరిగిన బెంగాళ్, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఓటమి తప్పలేదన్నారు. ఇప్పటికైన ప్రతిపక్షాలు అనవసరమైన వ్యక్తిగత విమర్శలు మాని సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. సభ్యతా సంస్కారం లేకుండా ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు చులకన భావంతో చూస్తారని హితవు పలికారు. ఎన్నికల జరిగిన అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ భారీగా మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story