కేరళ రిజల్ట్: ఆధిక్యంలో లెఫ్ట్ కూటమి

by Shamantha N |
కేరళ రిజల్ట్: ఆధిక్యంలో లెఫ్ట్ కూటమి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే కేరళ, బెంగాల్, పుదుచ్చేరి, అసోంలో కౌంటింగ్ ప్రారంభం అయింది. ముఖ్యంగా కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోసారి ప్రధాన పార్టీలైన LCF, UDF పార్టీలు పోటీ హోరాహోరిగా తలపడుతున్నాయి. ప్రస్తుతం ఎల్డీఎఫ్ 80 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా, యూడీఎఫ్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2 స్థానాల్లో ఆధికత్య కొనసాగిస్తోంది. అంతేగాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో సంపూర్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. ఎల్డీఎఫ్ పూర్తి మెజార్టీ సాధించి, మళ్లీ అధికారం చేజిక్కికుంటుందని స్పష్టం చేసింది. మరి చివరకు ఏం జరుగుతోందో చూడాలి. కాగా, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ చేపట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed