- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. RSP సెన్సేషనల్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో : భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ బంగారు భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచించే నాయకులకు ఓట్లేసినప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని, లేకపోతే బతుకులు చీకటిమయం అవడం ఖాయమని అన్నారు. అందుకే ఎవరికి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఈరోజే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
గతేడాది జూన్‌లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలవుతోందని ఇందులో కల్నల్ సంతోష్ కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 19 మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే, మరి ఇటీవల అమరులైన పంజాబ్ 700 రైతు కుటుంబాలకు కేసీఆర్ రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించారని, కానీ వారికి ఆ ఎక్స్ గ్రేషియా అందడానికి ఎన్ని యుగాలు పడుతుందోనని ఎద్దేవా చేశారు.