- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ చట్టాల రద్దుకు అసెంబ్లీలో తీర్మానించాలి
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మంగళవారం కోరారు. వంద రోజులకు పైగా లక్షలాది మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పంటల కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 2015 నుంచి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి ఎక్కడా ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వట్లేదని, కనీసం అంచనాలు కూడా పూర్తిగా వేయట్లేదన్నారు. రుణమాఫీ చేసి ప్రభుత్వమే భరించాలన్నారు. భూసర్వే చేసి నిజమైన హక్కుదారులకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలన్నారు. పోడు భూముల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు.
Advertisement
Next Story