- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిప్యూటీ తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల పగ్గాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహశీల్దార్లకు అప్పగించారు. ఇప్పుడేమో వారికి పని భారం పెరిగిందన్న నెపంతో డిప్యూటీ తహశీల్దార్లకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తహశీల్దార్లు లేదా జాయింట్ రిజిస్ట్రార్ల విధులకు కోత పెట్టారు. కొందరు కలెక్టర్లు అంతర్గత ఆదేశాలతో మండలంలో క్రయ విక్రయాల బాధ్యతలను, అధికారాలను డిప్యూటీ తహశీల్దార్లకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఈ మేరకు కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిజానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. తహశీల్దార్ల నుంచి నాయబ్ తహశీల్దార్లకు బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు, వరంగల్, కరీంనగర్ పట్టణాల పక్కనే ఉన్న మండలాల తహశీల్దార్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ హోదాను చట్టబద్ధంగా, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం తహశీల్దార్/జాయింట్ రిజిస్ట్రార్ గా మార్చారు.
ఈ క్రమంలో తమ అధికారాలకు కత్తెర వేయడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తింది. పైగా అటు సీసీఎల్ఏ, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓలు, సర్క్యులర్లు లేకుండానే, చట్టంలో ఎలాంటి సవరణ చేయకుండానే రెవెన్యూ లేదా భూ పరిపాలనలో సరికొత్త మార్పును అమలు చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన చట్టంలోనే తహశీల్దార్ సెలవులో ఉంటే ఆయన బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలన్న అంశంపైనే స్పష్టత లేదు. ఇప్పుడేమో ఏకంగా వారి హోదాకు మంగళం పాడుతుండడంపై ఉద్యోగ సంఘాల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తహశీల్దార్లు మాత్రమే తమ అధికారాల్లో కోత పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మెజార్టీ అధికారులు మాత్రం తమకు పని భారం తగ్గుతుందన్న హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు ‘దిశ’తో అన్నారు. ఆ రిజిస్ట్రేషన్ల బాధ్యతతో మిగతా పనులన్నీ కుంటుపడుతున్నట్లు చెప్పారు.