కేసు నమోదు చేశాం.. పరకాల ఏసీపీ శివరామయ్య స్పష్టం

by Shyam |
ACP Shivaramaiah
X

దిశ, ఆత్మకూర్: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారును అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు పరకాల ఏసీపీ శివరామయ్య తెలిపారు. శనివారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 6వ తేదీన మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ ఓపెనింగ్ కోసం వచ్చిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అడ్డం తిరిగి దౌర్జన్యానికి దిగిన వారిపై కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో పరకాల రవి(వాసు), రేవూరి జైపాల్ రెడ్డి, భగ్గి శ్రీనివాస్, బయ్య తిరుపతి, బయ్య కుమారస్వామి, తనుగుల సందీప్, దయ్యాల రమేష్, కుక్కల రఘుపతి, అలవాల రవి, పసునురి దేవేందర్, తోట మహేందర్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపించామని శివరామయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ రంజిత్ కుమార్, ఎస్ఐ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story