- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది :జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ఉన్నతాధికారులతో సీఎం జగన్ కరోనా కట్టడిపై వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయడానికి ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్ నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది వరకు అందరు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.19 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 23 లక్షల డోసులు రోజు తయారవుతున్నాయని, వ్యాక్సిన్ పై పూర్తి నియంత్రణ కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. లాక్ డౌన్ విధించకుండానే కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొని వారి జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయని, అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని వెల్లడించారు.