ఆవిరైపోతున్న రైతుల ఆశలు.. దిగజారుతున్న పంటల ధరలు

by Aamani |
ఆవిరైపోతున్న రైతుల ఆశలు.. దిగజారుతున్న పంటల ధరలు
X

దిశ కుబీర్: పంటలు చేతికి రాక ముందు ఊరించి, మురిపించిన, సోయా, పత్తి ధరలు రోజురోజుకు ఢమాల్ మనిపిస్తున్నాయి. రైతుల ఆశలు రోజు రోజుకు ఆవిరై పోతున్నాయి. గురువారం కుబీర్ మండల కేంద్రంలో మహానవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి కొనుగోళ్ళు మొదలయ్యాయి. పత్తి క్వింటాలు కు ₹6451 ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. పత్తి ఇప్పుడిప్పుడే మార్కెట్ కు వస్తోంది. కొన్ని రోజుల కింద పలు మార్కెట్లలో పత్తి క్వింటాలుకు 7700 పలికింది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే క్వింటాలుకు రైతు సుమారుగా 1200 రూపాయలు నష్టపోతున్నాడు. సోయా క్వింటాళ్లకు 10 వేల రూపాయల పై చిలుకు పలికింది.

ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో క్వింటాకు ₹5200 కొనుగోలు చేస్తున్నారు. అతివృష్టి వల్ల రంగుమారిన వాటిని ఇష్టం వచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అప్పటి ధరలతో పోల్చుకుంటే క్వింటాకు రైతు సుమారుగా 4500₹ నష్టపోతున్నాడు. వీటి ముడిసరుకుల తో తయారైన వస్తువుల ధరల తగ్గక పోయినా పంటల ధరలు రోజు రోజుకు పతనమై పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ తదితర పెట్టుబడులను లెక్కిస్తే ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలు నష్టాలనే మిగిల్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed