- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ సెషన్‌లోనే పీఆర్సీ ప్రకటించాలి
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లోనే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ( టీఎస్ మెసా) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 29 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించేందుకు అంగీకారం తెలిపారన్నారు. అయితే పీఆర్సీని 43 శాతం పెంచాలని కోరారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పీఆర్సీ ప్రకటించారని, ఇప్పుడు కూడా అదేరకంగా ప్రకటించాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని, విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలన్న తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఫారూఖ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story