- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి తలసాని కుమారుడిని సేవ్ చేసేందుకు పోలీసుల పాట్లు.. నెటిజన్ల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కుమార్ యాదవ్ శుక్రవారం ఖైరతాబాద్‌లో జరిగిన సదర్ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై నుంచి కారు వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు సాయికుమార్ యాదవ్ కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇది గమనించిన పోలీసులు మంత్రి కొడుకు కావడంతో గాయపడిన వ్యక్తి కుటుంబానికి నచ్చజెప్పి, బాధితుడిని పోలీసు వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఈ ఘటనను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తు్న్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు, మంత్రి కుమారుడు కావడం వల్ల పోలీసులు ఇలా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. సాయికుమార్ యాదవ్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు కూడా నమోదు చేయకపోవడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన FIRలో ఎవరి పేరునూ ప్రస్తావించకపోవడం గమనార్హం. FIRలో కేవలం కారు నెంబర్ ‘TS07HW0001’ తో ప్రమాదకరంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా వ్యక్తి కాలుకు గాయమైనట్లు మాత్రమే ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది.
Got the copy of the FIR. 32yr old Santosh who works as an Office boy was hit by a car during Sadar celebrations at Khairatabad yesterday. Accident victim’s left ankle is fractured due to rash and negligent driving of driver of TS07HW0001. No names mentioned. #TRS #MinisterSon pic.twitter.com/k0q0nNnBIU
— Revathi (@revathitweets) November 6, 2021