- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో వైఫ్ సీక్రెట్ బయటపెట్టిన కాజోల్.. వీడియో వైరల్
దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది యాక్టర్స్ సినిమాలతో పాటు టీవీ షోస్‌లోనూ అలరిస్తున్నారు. ఇంకా కొందరు సొంత యూట్యూబ్ చానెల్‌లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ‘ట్విక్’ ఇండియా’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న కాజోల్.. తాజాగా హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫ్యామిలీ, భర్త అక్షయ్ గురించి ప్రశ్నించగా.. ట్వింకిల్ సరదాగా చెప్పిన ఆన్సర్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
నిజానికి ట్వింకిల్ కూడా చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు అతను సంపాదించిన డబ్బంతా ఏం చేశారు? ఇప్పుడు అక్షయ్ సంపాదిస్తున్నది ఏం చేస్తున్నారు? అని కాజోల్ ప్రశ్నించింది. దీనికి ఫన్నీగా ఆన్సర్ చేసిన ట్వింకిల్.. ‘నా డబ్బును పిల్లలు చదువులకు ఖర్చు పెడతాను. ఎందుకంటే మీకు చదువు చెప్పించింది నేనే అని భవిష్యత్తులో గర్వంగా చెప్పుకోవచ్చు’ అని చెప్పింది.
ఇక ఇదే ప్రశ్నను కాజోల్‌ను అడిగితే.. ‘అజయ్‌కు సంబంధించింది ఏదైనా నాదే. నాకు సంబంధించింది ఏదైనా తనదే. కానీ పిల్లలు మాత్రం నా వాళ్లే. అంటే ఏది సౌలభ్యంగా ఉంటే అదే మనది’ అని చెప్పడంతో ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. కాగా ఈ ఇంటర్వూను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ట్వింకిల్.. మొత్తం ఎపిసోడ్‌ను @tweakindia YouTube చానెల్‌లో చూడవచ్చని లేదంటే తన Instagram స్టోరీస్‌లోని లింక్‌ను క్లిక్ చేయండని తెలిపింది.