- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండలిలో టాప్‌లో టీఆర్ఎస్.. బీజేపీకి నో ప్లేస్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 36కు చేరుకుంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్‌కు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే పట్టభద్రుల ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించలేదు. దీనికి తోడు ఎమ్మెల్యేలు సైతం లేకపోవడంతో ఆ కోటాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మండలిలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో కలిపి 38 మంది సభ్యులు ఉన్నారు.
పట్టభద్రుల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ సభ్యులు ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇద్దరు టీఆర్ఎస్ వారే ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో 13 మంది టీఆర్ఎస్ సభ్యులు, గవర్నర్ కోటాలో ఆరుగురు, ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో గులాబీ పార్టీ సభ్యుల సంఖ్య మండలిలో 36కు చేరుకుంది. మండలిలో ఎంఐఎం నుంచి ఇద్దరు సభ్యులు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్(ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి)గా ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.