అమెరికా నుంచి భద్రాద్రికి వచ్చిన నూతన దంపతులు

by Sridhar Babu |
అమెరికా నుంచి భద్రాద్రికి వచ్చిన నూతన దంపతులు
X

దిశ, భద్రాచలం అర్బన్: అమెరికాలో పెళ్ళి చేసుకొని మొదటిసారి భద్రాచలం విచ్చేసిన నూతన దంపతులు భరత్, నికిత శర్మలకు బంధుమిత్రులు అపూర్వ స్వాగతం పలికారు. ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ కుమారుడు భరత్, నికితశర్మ దంపతులకు గురువారం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికి అక్కడి నుంచి డప్పు దరువులు, కొమ్ము డాన్సులతో ఇంటివరకు భారీ ర్యాలీగా వచ్చారు. అనంతరం పలువురు పుర ప్రముఖులు నూతన దంపతులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story