- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త పట్టా పాస్‌బుక్‌లు పంపిణీ చేసిన మంత్రి..
దిశ, భీమ్‌గల్: మండలంలోని మెండోరా గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం ఐదు వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవక్కపేట్ గ్రామంలో కొత్త పట్టా పాస్ బుక్‌లు పంపిణీ చేశారు. 2017 భూ ప్రక్షాళన సర్వేలో ఆగిపోయిన కొత్త పట్టా పాస్‌బుక్‌లు అందించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత కొత్త పట్టా పాస్‌బుక్ రికార్డుకు మార్గం సుగమం అయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భూమి ఉండి ఆ భూమి తన పేరు మీద లేకపోవడంతో రైతులు ఎంతో అభద్రత భావానికి లోనవుతారన్నారు. జిల్లాలో మొత్తం 10,500 ఎకరాలు అభ్యంతరాలు ఉండడంతో పట్టాలు కాలేక ఆగిపోయినవని, ఇప్పుడు 580 ఎకరాలు పట్టాలు చేశామని తెలిపారు. దేవక్కపేటలో పెండింగ్లో ఉన్న 580 ఎకరాల పట్టాలు 204 మందికి పట్టా చేయడం జరిగిందని, మిగతా 40 మందికి సాంకేతిక సమస్య ఉండడంతో కొంచెం ఆలస్యం అవుతుందని తహశీల్దార్ రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మహేష్, రాజేశ్వర్, చౌటుపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.