కనీసం 15 రోజులైనా లాక్‌డౌన్ చేయండి

దిశ, ఆలేరు: యాదగిరిగుట్టలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధామహేందర్ గౌడ్, కాటబత్తిని ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…

యాదాద్రి దేవాలయానికి రోజువారిగా భక్తులు ఎక్కడినుంచో వస్తున్నారని, అంతేగాకుండా వారు రాత్రి ఇక్కడే బస చేస్తున్నారని, దాని మూలంగా కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందన్నారు. కాగా దీనిని గమనించి మున్సిపల్ పరిధిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని కోరారు. కనీసం 15 రోజులైనా దర్శనాలు మూసివేసి గుట్ట ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Advertisement