- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోగులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే నోముల
దిశ, హాలియ: హాలియాలో కొత్తగా ఏర్పాటుచేసిన తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. ముఖ్య అతిధిగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హజరైయారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాలియా మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతోందని, వైద్య సేవల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు.
నియోజకవర్గంలోని తిరుమలగిరి, సాగర్, పెద్దవూర, నిడమనూర్, అనుముల మండలాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం 40 km దూరం వెళ్ళాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఇక అలాంటి పరిస్థితులు రాకుండా ఈ హాస్పిటల్ ఉపయోగ పడుతుందని, డాక్టర్లు సేవా భావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, పట్టణ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.