వారి ముందు అవమాన పరిచారని.. ఓటు వేయకుండానే వెనుదిరిగిన ఎంపీటీసీ..

by Shyam |
వారి ముందు అవమాన పరిచారని.. ఓటు వేయకుండానే వెనుదిరిగిన ఎంపీటీసీ..
X

దిశ, అనంతగిరి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో అనంతగిరి మండలం ఎంపీటీసీ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో స్వేచ్ఛగా తమ ఓటును వేశారు. అయితే అనంతగిరి మండల వ్యాప్తంగా తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉండగా ఐదుగురు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు, నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.

కాగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు తొమ్మిది మంది ఎంపీటీసీలు చేరుకున్న సమయంలో అనంతగిరి మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ మాదాసు రాంబాబు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇదే విషయమై పోలింగ్ కేంద్రం వద్ద పలువురు నాయకులు చర్చించుకుంటూ.. డబ్బులు పంచే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ముందు రాంబాబును టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ లు అవమాన పరిచారని, దానికి ఆయన కలతచెంది ఓటు వేయకుండా వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed