- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రామాలయంలో అన్నదానం.. ముఖ్య అతిథిగా హనుమంతుడు

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రమాదాలు ఉన్నా, కొన్నిసార్లు వాటివలన అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతున్నాం. ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ప్రకృతి అందాలు, విచిత్రమైన జీవాలు, వింతలు, విశేషాలు.. ఒక్కటేముంది ప్రపంచంలో అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నాం. ఇక తాజాగా ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రామాలయంలో అన్నదానానికి ఒక అనుకోని అతిథి విచ్చేసింది. గుడిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భావం ఉండదు. అందుకే దానికి కూడా అందరితో పాటు వడ్డించారు. మారు మాట్లాడకుండా చక్కగా తినేసి వెళ్ళిపోయింది ఆ అతిథి. ఇంతకీ ఆ వచ్చిన అతిధి ఎవరనుకొంటున్నారు.. ఒక వానరం.
మహారాష్ట్రలోని ఒక రామాలయంలో జరుగుతున్న అన్నదానానికి ఒక వానరం హాజరై, ఎంచక్కా కడుపునిండా భోజనం ఆరగించి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాముడికి హనుమంతుడు ఎంతటి భక్తుడో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. అలాంటి హనుమంతుడే రాముడి గుడిలో అన్నదానానికి హాజరై ఆశీస్సులు అందించాడు.. జై శ్రీరామ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.