- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ప్రధాని నిర్ణయాలు అద్భుతం'
దిశ, మెదక్: కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 70 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలా మండిందని ఆయన అన్నారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిమ్ మహిళలు ఆత్మగౌరవంతో బ్రతికేల మోడీ భరోసానిచ్చారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక గ్రామంలో మోతుకు నరేశ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లేఖ ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని వివరిస్తూ లేఖను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్, 370 ఆర్టికల్ రద్దు వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారని శ్రీకాంత్ గుర్తు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఆత్మ నిర్భర్ భారత్ పథంకం ప్రవేశపెట్టరాని తెలిపారు. పేద కుటుంబాలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ ను కేంద్రం అందిస్తుందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.