త్వరలోనే వంద పడకల ఆసుపత్రి: నకిరేకల్ ఎమ్మెల్యే

by Shyam |
త్వరలోనే వంద పడకల ఆసుపత్రి: నకిరేకల్ ఎమ్మెల్యే
X

దిశ నకిరేకల్: నకరేకల్ పట్టణంలో రాబోయే రెండేళ్లలో వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. అదేవిధంగా డిగ్రీ కళాశాల నిర్మాణం, సువిశాలమైన రోడ్లను ఏర్పాటుచేసి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం అన్నారు.

మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ శనివారం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు కొండంత భరోసా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed