‘తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం’

by Shyam |
‘తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : అకాల వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ధాన్యం కొనుగోలు పై అన్ని జిల్లాల కలెక్టర్లకు అదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలిని సూచించారు. చివరి ఆయకట్టు రైతులకు ఆఖరుతడికి నీళ్లందించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో ప్రకృతివనాలలో చెట్లు ఎండకుండా ఈ రెండు నెలలు సర్పంచులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లందించి కాపాడుకోవాలని సూచించారు.

ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించి వెంటనే కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలని చెప్పారు. గ్రామాలలో పాడుబడ్డ ఇళ్లను ఈ రెండు నెలలలో గుర్తించి శుభ్రంచేయాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సిద్దంకావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కార్యకర్తలకు చెప్పారు. కరోనా విస్తృతి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించండని .. తప్పనిసరిగా మాస్క్ ధరించండని సూచించారు. కరోనా నుండి పూర్తిగా కోలుకున్నా .. త్వరలోనే తిరిగి ప్రజాసేవకు మీ ముందుకు వస్తానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed