ప్రాణాల‌కు తెగించి పనిచేస్తున్న మీడియా : ఎర్ర‌బెల్లి

by Shyam |   ( Updated:2020-04-14 01:39:41.0  )
ప్రాణాల‌కు తెగించి పనిచేస్తున్న మీడియా : ఎర్ర‌బెల్లి
X

దిశ, వరంగల్: క‌రోనా వైర‌స్ మొత్తం ప్ర‌పంచాన్నే స్తంభింపజేసింద‌ని, ఈ ద‌శ‌లో విలేక‌రులు త‌మ ప్రాణాల‌కు తెగించి, ప‌నిచేస్తున్నార‌న్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఆయన స్వగ్రామం పర్వతగిరిలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు త‌ర‌పున 16 ర‌కాల నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో కూడిన కిట్ల‌ను విలేకరుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైర‌స్ నేప‌థ్యంలో క‌వ‌రేజీలో మీడియా మిత్రులు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, సామాజిక‌, భౌతిక దూరాన్ని క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని, త‌మ కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌న్న ఆలోచ‌న‌తో ప‌ని చేయాల‌ని మంత్రి సూచించారు.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి నుంచి కరోనాపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యప‌రుస్తూ బ‌య‌లుదేరిన మంత్రికి మార్గ‌ం మ‌ధ్యలో ఉపాధి హామీ కూలీలు క‌నిపించారు. వెంట‌నే ఆయన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. కూలీల వద్ద ఉన్న గ‌డ్డ‌పార తీసుకుని మ‌ట్టిని త‌వ్వుతూ మాట కలిపారు. కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సామాజిక‌, భౌతిక దూరాన్ని పాటించాల‌ని సూచించారు. ముఖాల‌కు బ‌ట్ట‌లు క‌ట్టుకోవాల‌ని చెప్పారు.

Tags : Minister, distributed, essential commodities, journalists, warangal

Advertisement

Next Story