- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మద్యపానం సేవించేందుకు కనీస వయసెంత?
దిశ, ఫీచర్స్ : హర్యానా ప్రభుత్వం తన ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది. మద్యం కొనేందుకు, విక్రయించేందుకు చట్టపరమైన వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించింది. శీతాకాల సమావేశాల ముగింపు రోజు విధానసభలో వయోపరిమితి మార్పుకు సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మన దేశంలో 21 ఏళ్ల వయసు వస్తే వైన్స్‌కు వెళ్లి మందు తెచ్చుకోవచ్చు. మరి ఇతర దేశాల్లో వయసు విషయంలో ఎలాంటి నిబంధనలున్నాయో ఓ సారి తెలుసుకుందాం.
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో చట్టపరమైన మద్యపాన వయసు 18 సంవత్సరాలు. అన్ని రాష్ట్రాలు మరియు భూభాగాలు ఈ వయసులోపు వ్యక్తులు మద్యం కొనుగోలు చేయడాన్ని.. లైసెన్స్ పొందిన ప్రాంగణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించాయి. అయితే మైనర్స్ తమ పెద్దలతో కలిసి ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండవచ్చు.
బంగ్లాదేశ్: నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి పొందిన వ్యక్తి తప్ప దేశంలో అన్ని వయస్సుల వారికి మద్యం అమ్మకం నిషేధించబడింది. ముస్లింలు వైద్య కారణాల కోసం మాత్రమే అనుమతిని పొందవచ్చు.
కెనడా: మానిటోబా, న్యూ బ్రున్స్‌విక్‌లోని లైసెన్స్ పొందిన ప్రాంగణాలతో పాటు ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం, అల్బెర్టా, బ్రిటిష్ కొలంబియా, అంటారియో, సస్కట్చేవాన్‌లలో పెద్దల పర్యవేక్షణలో ఇంట్లో మాత్రమే మైనర్లు మద్యం తాగవచ్చని IARD(The International Alliance for Responsible Drinking) తెలిపింది.
ఈజిప్ట్: 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుంటే చాలు వారు మద్యం స్వీకరించవచ్చు.
జర్మనీ: బీర్, వైన్ కోసం 16 (తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కలిసి ఉంటే 14), స్పిరిట్స్ కోసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నది అక్కడి నిబంధన. బార్స్, నైట్‌క్లబ్స్ వంటి ప్రదేశాలకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి అనుమతి లేదు.
భారతదేశం: గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జమ్మూ- కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 21 ఏళ్లు. ఇక హర్యానా, మేఘాలయ, పంజాబ్, ఢిల్లీలో మద్యం కొనుగోలు చేయాలంటే గతంలో 25 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 21 సంవత్సరాలు.
బీహార్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్‌లతో సహా పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి.
మలేషియా: ముస్లింలకు మద్యం అమ్మడాన్ని నిషేధించగా, ముస్లిమేతరులకు చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు.
శ్రీలంక: 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే మద్యం విక్రయిస్తారు.
UAE: షార్జాలో అమ్మకం, సరఫరా, వినియోగం నిషేధించగా, ఇతర ప్రదేశాలలో వయోపరిమితి 21ఏళ్లకు పరిమితం చేశారు.
US: యూఎస్‌లో కనీస చట్టపరమైన మద్యపాన వయస్సు 21. జాతీయ కనీస మద్యపాన వయస్సు చట్టం 1984 అమలుకు ముందు, మద్యం కొనుగోలు చేసే చట్టపరమైన వయస్సు వివిధ రాష్ట్రాలకు భిన్నంగా ఉండేది.
UK: యూకేలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి.. బహిరంగంగా మద్యం సేవిస్తే, వారిని పోలీసులు ఆపవచ్చు, జరిమానా విధించవచ్చు లేదా అరెస్టు చేయవచ్చు. అయితే, 16 లేదా 17 ఏళ్ల వ్యక్తి తమకంటే పెద్దవారితో కలిసి ఉంటే, భోజనంతో పాటు వైన్, బీర్ లేదా పళ్లరసాలు తాగేందుకు అనుమతిస్తారు. కానీ కొనుగోలు చేయరాదు. స్థూలంగా, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కోసం మద్యం అమ్మడం, కొనడం లేదా కొనడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధం.
ఇరాన్, కువైట్, లిబియా, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ : మద్యం అమ్మకం, కొనుగోలు, వినియోగం నిషేధం.