మావోయిస్టులెవరూ కరోనా బారిన పడలేదు

by Shamantha N |
Maoists 21st bandh
X

దిశ, వెబ్‌డెస్క్: భారీగా మావోయిస్టులు కరోనా బారినపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దాదాపు 100 పైనే మావోలు కరోనా బారినపడ్డారని, వారు రహస్యంగా చికిత్స పొందుతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే.. తాజాగా.. ఆ వార్తలపై మావోయిస్టు దక్షిణ సబ్‌జోనల్ కమిటీ స్పందించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు కరోనా బారినపడ్డారని, పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారని అన్నారు. కరోనా పేరుతో పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తూ ఆదివాసీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులెవరూ కరోనా బారినపడలేదని స్పష్టం చేశారు. పోలీసులే కావాలని కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గంగాల్‌ను పోలీసులు హత్య చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చికిత్స కోసం బయటకు వస్తే.. పోలీసులే కిరాతకంగా గంగాల్‌ను చంపారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed