'మా అన్నను చంపేశారు… కారణం ఇదే!'

by Sumithra |   ( Updated:2021-03-24 03:00:30.0  )
మా అన్నను చంపేశారు… కారణం ఇదే!
X

దిశ, జవహార్ నగర్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ లో సునీల్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం ఉదయం ఇంటి ఎదుట కిందపడి ఉన్న సునీల్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సునీల్ మృతికి అక్రమ సంబంధమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సునీల్ ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు కూడా అతనిది హత్యనా? లేక ఆత్మహత్య? అనే కోణంలో అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతని మృతదేహాన్ని పరిశీలించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్రమ సంబంధం కారణంగానే తన అన్నను హత్య చేశారని అతని సోదరుడు ఆరోపించారు. తమకు అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. జవహర్ నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సునీల్ మరణానికి గల కారణాలను అన్ని కోణాలలో విశ్లేషిస్తున్నారు..

Next Story

Most Viewed