బియ్యం లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

దిశ, తుంగతుర్తి: నల్లగొండలోని ఓ రైస్ మిల్ నుండి బియ్యం లోడుతో జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన మరో రైస్ మిల్ కు తరలిస్తున్న క్రమంలో యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ శివారులో అర్థరాత్రి సుమారుగా రెండు గంటల 30 నిమిషాల సమయంలో ప్రమాదవశాత్తు లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీ పాక్షికంగా దగ్ధమైంది. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రం హీట్ అవడంతో టైర్లకు మంటలు చెలరేగాయని, ఇది గమనించి లారీని పక్కకు నిలిపి ఫైరింజన్ కు సమాచారం ఇచ్చామని, సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారని ఆయన తెలిపారు. అయితే ఆ లారీలో తరిలిస్తున్న బియ్యం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement