- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్రత తగ్గితే 20 తర్వాత లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు: సీఎం
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది డిశ్చార్జికాగా గురువారం మరో 128 మంది డిశ్చార్జి కానున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ బుధవారం విడుదలైన మార్గదర్శకాల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు యధాతథంగా ఇది కొనసాగుతుందని, ఆ తర్వాత పరిస్థితులను విశ్లేషించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ లాక్‌డౌన్‌లో ప్రజలు సహకరిస్తున్న విధంగానే ఇకపైన కూడా బాధ్యతగా ఉండాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద కొనసాగుతున్న 228 కంటైన్‌మెంట్ క్లస్టర్లకు అదనంగా 31 చేరాయి. దీంతో మొత్తం క్లస్టర్ల సంఖ్య 259కు చేరుకుంది. ఈ కారణంగా ఆ క్లస్టర్లలో ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన తర్వాత తీసుకుంటున్న చర్యలతో వస్తున్న ఫలితాలు తదితరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సహా ఆరోగ్య మంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి తదితరులంతా మాస్కులు ధరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ఇప్పటికే 118 మంది డిశ్చార్జి అయ్యారని, గురువారం మరో 128 మంది డిశ్చార్జి కానున్నారని, యాక్టివ్ పాటిజివ్ పేషెంట్ల సంఖ్య తగ్గుతూ ఉన్నదని వివరించారు. ఇదే సమయంలో క్లస్టర్లలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం, నోడల్ ఆఫీసర్ తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు.
‘‘కరోనా వైరస్ వ్యాప్తికి అనుగుణంగా రాష్ట్రంలో 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా లక్షణాలు ఎంతమందిలో కనిపించినా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సంఖ్యలో టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కూడా కొరతలేదు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో 2.75 లక్షల కిట్లు అందుతాయి. మరో 5 లక్షల పీపీఈ కిట్లకు కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇక మాస్కుల విషయంలో రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మరో 1.75 లక్షలు వస్తాయి. అయినా ఇంకో 5 లక్షల మాస్కులకు ఆర్డర్ ఇచ్చాం. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లకు కూడా చికిత్స అందించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ పరిస్థితిలో పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. పేదలకు సాయం అందించడంలో, పంటల కొనుగోళ్ళ దగ్గరా ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చొరవపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ మొదలు మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చేరవేయాల్సినవాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాల్సి ఉన్నందున గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నెల కోసం రూ.308 కోట్లు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Tags : Telangana, CM KCR, Corona, Reveiw, LockDown, Relaxations, April 20, Guidelines