- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొంగలు నేర్పిన పాఠం… మనుషులు నేర్చుకొనేనా?
దిశ, ముధోల్: మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి అని పెద్దలు అంటారు. కొన్నిసార్లు మనుషులే కాదు జంతువులు, పక్షలు సైతం మనకి పాఠాలు నేర్పుతాయి. తాజాగా కొన్ని కొంగలు ఇప్పుడున్న పరిస్థిని అర్ధం చేసుకొని మనుషులకు ఒక సందేశాన్ని తెలుపుతున్నాయి. కొంగలు ఏంటి? మనకు పాఠాలు నేర్పడమేంటి అనుకుంటున్నారా ? ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి.. గుడులు, బడులు మూసివేస్తున్నాయి.. ఇక మాస్క్ లు పెట్టుకోకపోతే ఫైన్ లు వేస్తున్నాయి. అయినా కొంతమంది ప్రజలు మాత్రం ఈ మాటలను పెడచెవిని పెడుతున్నారు.
కరోనా కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించాలి… మాస్క్లు ధరించాలి అని ఎంతమంది చెప్తున్నా వినని వారికి ఈ కొంగలు ఒక గుణపాఠం చెప్పాయని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఈ పక్షలు సైతం ఎంతో క్రమశిక్షణ గా భౌతిక దూరం పాటిస్తున్నాయి. శుక్రవారం ప్రొద్దున బై0సా పట్టణం డి ఎస్ పి కార్యాలయం ముందు గల ప్రభుత్వ పాఠశాల భవనం పై ఒక వరుస క్రమంలో కొంగలు నిలబడి ఉన్న దృశ్యం కెమెరా కంటికి చిక్కి కనువిందు చేసింది.
కరోనా సెకండ్ వేవ్ కావడంతో వాటిలానే మనుషులమైన మనం కూడా సామాజిక దూరాన్ని పాటించాలని, గుంపులు గుంపులుగా వుండద్దని క్రమశిక్షణ తో వుండాలని పక్షులు తెలుపుతున్నట్లు కనిపిస్తుంది కదా.. అందుకే మంచి ఎవరు చెప్పిన తీసుకోవాలి. ఈ కొంగలు సైతం మనకు మంచే చెప్తున్నాయి .. వాటిలానే మనం కూడా భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొడదాం.