- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్లు ఖుషీ.. రెండో దశ ‘వాహనమిత్ర’ డబ్బులు జమ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించిన నిధులను డ్రైవర్ల ఖాతాల్లో జమచేసింది. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిధులు జమ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన వారు జీవన భృతిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారి జీవనోపాధికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో రెండో దశ వాహనమిత్ర నగదును డ్రైవర్ల ఖాతాల్లోకి జమ చేశారు.
గతేడాది 2,24,737 వాహనమిత్ర పథకంలో భాగంగా 224.73 కోట్ల రూపాయలు జమ చేసింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మందికి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 262.49 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో వీరందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. గతేడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసిందన్నారు.
ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఈ సాయం అక్టోబర్‌లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయాన్ని అందిస్తున్నారు. ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని అందించడం విశేషం. కొత్త లబ్దిదారులంతా కొత్తగా ఆటోలు కొన్నవారు లేదా యాజమాన్య బదిలీ హక్కులు పొందినవారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో పలువురు డ్రైవర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.