- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయటపడుతున్న గంగను మింగిన ఘనులు
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో వందలాది ఎకరాలు ఆక్రమణ వ్యవహారంలో గంగను మింగిన ఘనులు బయట పడుతూనే ఉన్నారు. బుధవారం ఒక్కరోజే 1200 ఎకరాలకు పైగా కబ్జా జరిగినట్లు గుర్తించిన అధికారులు.. గురువారం మరో రెండు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ముధోల్ మండలం సాలాపూర్ పూర్ సావర్గాం గ్రామాల్లో సర్వే నిర్వహించగా సుమారు 450 ఎకరాలు పరాధీనం పాలైనట్లు అధికారులు గుర్తించారు. సాలాపూర్ గ్రామంలో 248 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించిన ల్యాండ్ సర్వే అధికారులు… సావర్గాం గ్రామంలో 199 ఎకరాలు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ భూములు పరుల చేతుల్లో ఉన్నట్లు తేల్చారు. తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తుండటంతో అధికారులు సైతం విస్తుపోతున్నారు.
Advertisement
Next Story