- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయితీ పెట్టిన భార్య.. బండరాళ్లతో కొట్టి చంపిన భర్త
by Sridhar Babu |
X
దిశ, మంథని: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను బండ రాళ్లతో కొట్టి చంపిన ఘటన మంథనిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపెట బానయ్య-రేణుకలు భార్యాభర్తలు. మనస్పర్థల కారణంగా గత కొన్నాళ్లుగా వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో రేణుక మధ్యలో నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమె వెనకాలే వెళ్లిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. బండరాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్ర కుమార్ తెలిపారు.
Advertisement
Next Story