- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయక భక్తులకు భారీ షాక్.. ట్యాంక్ బండ్ లో నిమజ్జనం లేనట్టేనా..?
దిశ, వెబ్ డెస్క్: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయకులను స్థానికంగా ఉన్న చెరువులు, కొలనులు, బల్దియా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లోనో నిమజ్జనం చేసే విధంగా ఆలోచించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు నిషేధించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిమజ్జనం సమయంలో ప్రభుత్వం తీసుకోనున్న నియంత్రణ చర్యలు, ఆంక్షలను సూచించాలని హైకోర్టు ఆదేశించింది.
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల సెంటిమెంట్నూ గౌరవిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని, ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని కోర్టు పేర్కొంది. ఈనెల 6న అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఆదేశాలు జారీ చేస్తామని తీర్పునిచ్చింది.