- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇటీవలే జీవో జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ల పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కడప డీఈవో జారీ చేసిన జీవో కాపీలను పిటిషనర్ ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు.
జీవో పరిశీలించిన న్యాయమూర్తులు ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం అర్ధమవుతోందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. ఈనెల 29న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే ఈ జీవోపై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.