ఎమ్మెల్యేగా గెలిచిన హీరో..

by Shamantha N |
Udayanidhi Stalin
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఓ హీరో విజయకేతనం ఎగురవేశారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంలో రాణిస్తున్న తమిళ సినీ ప్రముఖుల్లో ఇద్దరు హీరోలు ఎన్నికల బరిలో నిలిచారు. చెపాక్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా మాజీ సీఎం కరుణనిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్‌-ట్రిప్లికకేన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించటం విశేషం.

మరోవైపు మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించి తమిళ రాజకీయాలను శాసించాలి అనుకున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు అరవ ప్రజలు చెక్ పెట్టారు. ఆయన పోటి చేసిన దక్షణ కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఆయన తప్ప.. మిగతా అభ్యర్థులు పూర్తిగా వెనకబడి పోయారు. కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మయూర జయ కుమార్ కన్నా ముందంజలో ఉన్నారు.

Advertisement

Next Story