- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల కృషితోనే సింగరేణిలో అద్భుత ఫలితాలు
దిశ,మణుగూరు : మణుగూరు సింగరేణి బొగ్గుగనిలో కార్మికలందరి కృషితో, ఐక్యతనే సింగరేణిలో అద్భుతఫలితాలు సాధిస్తున్నామని మణుగూరు సింగరేణి జీఎం జక్కం రమేష్ అన్నారు. గురువారం మండలంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కార్మికలందరి కృషితో బొగ్గు ఉత్పత్తి తీయడంలో, బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే నెంబర్ వన్ అని మాట్లాడారు. సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 8,38,000 లక్షల టన్నులు కాగా 8,54913 లక్షల టన్నుల అనగా 112 శాతంతో ఉత్పత్తిలో జరిగిందన్నారు. ఏప్రిల్ 2021 నుండి 30 సెప్టెంబర్ 2021 వరకు ఉత్పత్తి లక్ష్యం 5148000 గాను 6246399 సాధించి 121 శాతంతో మణుగూరే ముందు ఉందని తెలిపారు. ఓబీలలో వెలికితీత లక్ష్యం 13.05 కాగా 9.70 లక్షల క్యూబిక్ మీటర్లు 74 శాతం వెలికితీయడం జరిగిందన్నారు.
అలాగే రైల్వే ర్యాక్స్ ద్వారా బొగ్గు రవాణా 126 ర్యాక్స్ పంపించి, సెప్టెంబర్ నెలలో మొత్తం 8లక్షల 49వేల 886 టన్నులు ర్యాక్స్ ద్వారా బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. సింగరేణిలో పని చేసే కార్మికులందరికి వ్యాక్సినేషన్ కరోనా నియంత్రణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొని, క్రమపద్ధతిలో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఇంత బొగ్గు ఉత్పత్తి సాధించడం కార్మికుల శ్రమే అని మాట్లాడారు. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య విషయంలో సింగరేణి సంస్ధ వెనకడుగు వేసేది లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణికి సంబందించిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.