‘క్యాన్సర్ నివారణకు కృషి చేస్తున్నాం’

by Shyam |
‘క్యాన్సర్ నివారణకు కృషి చేస్తున్నాం’
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వహించిన గ్లోబల్ వర్చువల్‌ను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ముఖ్యమని, దానిపై అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. తరచూ ఆహారపు అలవాట్లు మారటం క్యాన్సర్‌కు కారణం అన్నారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story