- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోతి ఆకారంలో వింత జంతువు..

X
దిశ.తాండూరు: విచిత్రాకారంతో ఉన్న ఓ వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్దేముల్ మండలం ఇందూరు జైరాం తాండ గ్రామానికి చెందిన పరశురామ్ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ నాలుగు మేకలు నడుపుకుంటున్నాడు. అయితే మంగళవారం ఉదయం ఓ మేక ప్రసవించింది. జన్మించిన మేక పిల్ల కొంచెం కోతి, కొంచెం మేక ఆకారంతో కొత్త వింత జంతువును పోలి ఉంది.
ఈ విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల గ్రామస్తులు ఆ వింత జంతువును చూడటానికి ఎగబడ్డారు. ఇటీవల బషీరాబాద్ మండలం జీవన్గీలో రెండు తలాల గేదె దూడ జన్మించన సంఘటన మరవకముందే తాజాగా జైరం తాండాలో వింత జంతువు జన్మించడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story