- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగం లక్ష్యాలను అందరూ కాపాడాలి
by Shyam |
![Madabhushi Sridhar Madabhushi Sridhar](https://www.dishadaily.com/wp-content/uploads/2021/03/Madabhushi-Sridhar.jpg)
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న అంశాలు చాలా ప్రధానమైనవని, వాటి లక్ష్యాలను నెరవేర్చడంలో దేశ ప్రజలందరూ ముందుండాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 124వ వర్థంతి సభను బుధవారం ఎస్‌ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో నిర్వహించారు. అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం శ్రీధర్ మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు పూర్తి సమాచారంతో విద్యనభ్యసించే కేంద్రంగా అకాడమీ ఉండాలని వ్యాఖ్యానించారు. సమాజానికి విలువలతో కూడిన ఉత్తమ అధికారులు కావాలని, భారత రాజ్యాంగంలోని అంశాలను శిక్షణలో అభ్యర్థులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అకాడమీ అడ్వైజర్ సత్యనారాయణ, ఎన్. వినయ్ కుమార్, సతీష్ కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story