ముగిసిన మూడోరోజు ఆట.. ఇండియా @96/2

by Anukaran |
ముగిసిన మూడోరోజు ఆట.. ఇండియా @96/2
X

దిశ, స్పోర్ట్స్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఓపెనర్ రోహిత్ శర్మ, గిల్ ఆచితూచి ఆడుతూ టీ విరామసమయానికి 26 పరుగులు చేశారు.

టీ విరామం తర్వాత ఇద్దరూ మెల్లగా స్కోర్ పెంచారు. గాయం నుంచి కోలుకున్న రోహిత్ క్రీజులో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆడాడు. మరోవైపు గిల్ తన క్లాస్ చూపించాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. టీమిండియా ఓపెనర్లు టెస్టుల్లో 14 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలిసారి 50కి పరుగులు జోడించారు. రెండో రోజు వీరిద్దరే ఆట ముగిస్తారని భావించిన సమయంలో రోహిత్ శర్మ‌ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో హాజెల్‌వుడ్ అవుట్ చేశాడు. అంతకు ముందే లయన్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. హాజెల్‌వుడ్‌కు చిక్కాడు. మరోవైపు అర్దసెంచరీ పూర్తి చేసుకున్న శుభమన్ గిల్ (50) వెంటనే కమ్మిన్స్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియా 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (5) ఆచితూచి ఆడి మరో వికెట్ పోకుండా కాపాడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 45 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా క్రమంగా పట్టు భిగిస్తున్నది. హాజిల్‌వుడ్, గిల్ చెరో ఒక వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed