బిగ్ బ్రేకింగ్ : ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

by Anukaran |   ( Updated:2021-12-12 00:52:58.0  )
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం‌లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్టులో కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే విజయనగరంలో రీ టెస్ట్ చేయగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా గుర్తించారు వైద్యులు. ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో ఏపీ వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34‌కు చేరింది.

Advertisement

Next Story