ఆకట్టుకుంటున్న ‘అర్ధ శతాబ్దం’ లుక్!

by Shyam |
ఆకట్టుకుంటున్న ‘అర్ధ శతాబ్దం’ లుక్!
X

దిశ, వెబ్‌డెస్క్: రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో, హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘అర్ధశతాబ్ధం' చిత్రం ఫస్ట్‌ లుక్ శుక్రవారం విడుదల చేశారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా విడుదలైన ‘అర్ధశతాబ్ధం’ కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ లుక్‌కి అన్ని వ‌ర్గాల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. తాజాగా చిత్ర నిర్మాత చిట్టి కిరణ్ రామోజు మాట్లాడుతూ… జనవరిలో టీజర్ విడుదల చేస్తామని తెలిపారు. సినిమా కోసం అందరూ ఎంతో శ్రమించి పనిచేసి, ఈ సినిమాను పూర్తి చేశారని వెల్లడించారు. చిత్రంలో వేగంగా పూర్తి చేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు అని అన్నారు.

Advertisement

Next Story