ముగ్గురు రైతులు సెల్ టవర్ ఎక్కి..

దిశ, తుంగతుర్తి: ముగ్గురు రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటనా జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సెల్ టవర్ ఎక్కి నిసరన వ్యక్తం చేశారు. కారణమేమని అడుగగా ‘అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి మా భూమిని కబ్జా చేశారు. మాది మాకు చెందకుండా చేస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. విసిగిపోయి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాం’ అని ఆ రైతులు పేర్కొన్నారు.

Advertisement