రైటింగ్ టీమ్‌లో తమిళులదే కీలక పాత్ర : ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్

by Shyam |   ( Updated:2021-05-25 05:41:26.0  )
రైటింగ్ టీమ్‌లో తమిళులదే కీలక పాత్ర : ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్
X

దిశ, సినిమా : ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో మేకర్స్ రాజ్ అండ్ డీకే స్పందించారు. ఈ మేరకు ఒక స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్స్.. ట్రైలర్ చుట్టూ నెలకొన్న వివాదానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ట్రైలర్‌లో చూపెట్టిన రెండు మూడు సీన్ల ఆధారంగానే కొన్ని ఊహాగానాలు, అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సిరీస్‌లో నటించిన వారితో పాటు క్రియేటివ్, రైటింగ్ టీమ్‌లో కీ రోల్ ప్లే చేసింది తమిళులే. పైగా తమిళ ప్రజల మనోభావాలు, కల్చర్ గురించి మాకు బాగా తెలుసు. వారి పట్ల మాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి’ అని తెలిపారు. ఇక ఈ సున్నితమైన, ప్రేరేపిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సీజన్ 1 కంటే ఎక్కువగా కష్టపడ్డామని రాజ్ అండ్ డీకే తమ స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. సిరీస్ రిలీజై, చూసేంత వరకు వెయిట్ చేయండని అభ్యర్థించిన మేకర్స్.. చూశాక తమ ప్రయత్నాన్ని తప్పకుండా మెచ్చుకుంటారని అభిప్రాయపడ్డారు. కాగా ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు సమంత, ప్రియమణి లీడ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story